Thursday, January 9, 2025

బిజెపిలో చేరనున్న జయసుధ !?

- Advertisement -
- Advertisement -

 

Jayasudha

హైదరాబాద్: బిజెపికి తెలంగాణలో సరైన నాయకులు లేరు. అందుకని వారు ‘ఆకర్ష్’ను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్‌లు తమ పార్టీని వదిలేశారు. శ్రవణ్ ఇప్పటికే బిజెపిలో చేరిపోయారు. కాగా కోమటి రెడ్డి మాత్రం త్వరలో కాషాయ తీర్థం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ నటి, మాజీ కాంగ్రెస్ ఎంఎల్‌ఏ జయసుధ కూడా బిజెపిలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె బిజెపి నేత ఈటల రాజేందర్‌తో భేటీ అయిన నేపథ్యంలో దీనికి ఊతం లభిస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 21న మునుగోడులో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా జయసుధ కూడా కాషాయ కండువా కప్పుకుంటారని అనుకుంటున్నారు. ఇప్పటికే మరో నటి విజయశాంతి బిజెపిలో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధను కూడా బిజెపి ‘ఆకర్ష్’ అయస్కాంతంలా లాగుతోందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News