Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అసిఫాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. గురువారం మంత్రి సీతక్క సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ, సిర్పూర్ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి, తుమ్ములేటి ప్రాజెక్టు కోసం చాలా చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ అంశాలపై ఇటీవలే ముఖ్యమంత్రిని కలిసి వివరించామని పేర్కొన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కోనేరు కోనప్ప స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News