Sunday, January 19, 2025

తప్పు చేసినోళ్లే ప్రాయాశ్చిత దీక్ష చేస్తారు: నటి రోజా

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుంటున్నారని నటి, మాజీ ఎంఎల్ఏ రోజా అన్నారు. వంద రోజుల పాలన నుంచి దృష్టి మళ్లించడానికే తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని తెచ్చారని అన్నారు. సిఎంవన్నీ దిగజారుడు మాటలన్నారు.

వైసిపి అధికారంలో చాలా మంది తిరుపతి దర్శనం చేసుకున్నారని, నాడు లడ్డు విషయంలో ఆక్షేపణలు చెప్పని వారు నేడు ఆరోపణలు చేస్తున్నారని రోజా విమర్శించారు. నింద వేస్తున్నారే తప్ప విచారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారే ప్రాయాశ్చిత దీక్ష చేస్తారని, చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ప్రాయాశ్చిత దీక్షలు చేసినా క్షమించడని అన్నారు. నిందలు వేస్తూ, టిటిడి ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని రోజా అన్నారు తిరుపతి మహిళగా ఊరుకోబోనని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News