Friday, December 20, 2024

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాజీ ఎంఎల్‌ఎ సంపత్ కుమార్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్‌ఎ సంపత్ కుమార్ శుక్రవారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. అదే సమయంలో టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లో జూపల్లి కృష్ణా రావు చేరిక విషయమై సంపత్ కుమార్ చర్చించినట్టుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరనున్నారు. త్వరలోనే కాంగ్రె స్ పార్టీలో జూపల్లి కృష్ణారావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు.

ఈ నెల 21వ తేదీ తర్వాత జూపల్లి కృష్ణా రావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 10న బిఆర్‌ఎస్ నాయ కత్వం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేసింది.ఈ ఇద్దరిని తమ పార్టీల్లో చేర్చుకొనేందుకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఈ ఇద్దరు మొగ్గు చూపుతున్నారు. గత వారంలో భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News