Monday, December 23, 2024

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి ఊరట

- Advertisement -
- Advertisement -

అరెస్టు చేయోద్దని హైకోర్టు ఆదేశం

మనతెలంగాణ, సిటిబ్యూరోః హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట లభించింది. గత ఏడాది డిసెంబర్‌లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ సాహిల్ తన స్నేహితులతో కలిసి కారులో వచ్చి ప్రజాభవన్ వద్ద ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగిన తర్వాత సాహిల్‌ను పంజాగుట్ట పోలీసులు తీసుకుని వెళ్లగా అక్కడి నుంచి తప్పించుకుని దుబాయ్ పారిపోయాడు.

అయితే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్‌స్పెక్టర్ కావాలనే సాహిల్‌ను తప్పించాడని ఉన్నతాధికారుల విచారణలో తేలడంతో ఇన్స్‌స్పెక్టర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో సాహిల్ తనపై నమోదైన కేసుపై క్వాష్ పిటిషన్ వేశాడు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ చేసింది. ర్యాష్ డ్రైవింగ్ కేసుకే ఎల్‌వోసీ జారీ చేశారని, సాహిల్‌పై 15 కేసులు ఉన్నట్టు చూపించారని సాహిల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.

అయితే చేయని తప్పుకి దుబాయ్ ఎందుకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారనే భయంతోనే దుబాయ్‌కు వెళ్లినట్లు సాహిల్ న్యాయవాది తెలిపారు.వాదనలు విన్న హైకోర్టు.. సాహిల్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈనెల 17న పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సాహిల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అలాగే పంజాగుట్ట కారు ప్రమాద కేసు వివరాలు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News