Sunday, January 19, 2025

బిఆర్‌ఎస్‌ను వీడిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: గతంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బిఆర్‌ఎస్‌కు శనివారం గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. బిఆర్‌ఎస్ పార్టీకి, ప్రాథమిక సభ్యతానికి చేస్తున్న రాజీనామాను ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో జరిగిన రాజకీయ పరిణామాల ద్వారా ఆయనకు స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి రాజయ్య బిఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల వేళ ఆయన పార్టీ మార్పు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. రాజయ్య వరంగల్ ఎంపిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే బిఆర్‌ఎస్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. బిఆర్‌ఎస్‌లో తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని, నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఓ మీడియా సంస్థతో రాజయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News