Monday, December 23, 2024

కాలువలో మాజీ మోడల్ మృతదేహం

- Advertisement -
- Advertisement -

మాజీ మోడల్ దివ్య పాహుజా మృతదేహాన్ని పోలీసులు ఓ కాలువలో కనుగొన్నారు. దివ్య ఈ నెల రెండో తేదీన గురుగ్రామ్ లోని ఓ హోటల్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఒక గ్యాంగ్ స్టర్ ను నకిలీ ఎన్ కౌంటర్ చేసిన కేసులో అరెస్టయి, ఏడేళ్ళ జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చిన దివ్య, మూడు నెలలకే హత్యకు గురైంది. ఆమెను హోటల్ యజమాని అభిజిత్, మరో ఇద్దరు కలసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని ఫోటోలు చూపి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నందునే దివ్యను చంపానని అభిజిత్ పోలీసుల ముందు ఒప్పుకున్నారు.

దివ్య మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యాలను హోటల్లోని సిసి కెమెరానుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి ఆమె మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులకు పదకొండు రోజుల తర్వాత హర్యానాలోని ఓ కాలువలో ఆమె శవం దొరికింది. దివ్యను హత్య చేసిన నిందితులు ఆమె మృతదేహాన్ని పంజాబ్ లోని బాఖడా కాలువలో పారేస్తే, అది హర్యానాకు కొట్టుకొచ్చినట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News