Monday, December 23, 2024

మోడల్ మృతదేహం హర్యానా కెనాల్‌లో లభ్యం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : గురుగ్రామ్ హోటల్‌లో హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పాహుజా మృతదేహాన్ని 11 రోజుల తరువాత కనుగొన్నారు. పెద్ద ఎత్తున జరిపిన గాలింపులో ఆమె భౌతికకాయం హర్యానా కెనాల్‌లో దొరికిందని అధికారులు శనివారం తెలిపారు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని కెనాల్‌లో ఆచూకి లభ్యం అయిందని వివరించారు. హత్యకేసులో నిందితుడు బాల్‌రాజ్ గిల్ ఇచ్చిన సమాచారం మేరకు జరిపిన గాలింపులో దివ్య శవం దొరకడం ఈ కేసు దర్యాప్తు క్రమంలో పురోగతికి దారితీసింది. ఐదుగురు వ్యక్తులు ఆమెను హోటల్ సిటీ పాయింట్‌కు తీసుకువెళ్లారని , రూం నెంబర్ 111లో తలకు గురిపెట్టి కాల్చారని, చనిపోయిన తరువాత శవాన్ని తరలించారని వెల్లడైంది.

మోడల్‌గా పేరొందిన దివ్య ఈ హోటల్ ఓనర్ అభిజిత్ సింగ్‌ను అశ్లీల చిత్రాలతో బ్లాక్‌మొయిల్ చేయడంతో, ఆమెను హోటల్‌కు పిలిపించి దారుణానికి దారుణానికి పాల్పడి ఉంటారని విచారణ క్రమంలో వెల్లడైంది. గిల్‌ను గురువారం కోల్‌కతా ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసి సమాచారం రాబట్టారు. తాను దివ్యను చంపినట్లు నిందితుడు అంగీకరించినట్లు వెల్లడైంది. ఆమెను చంపివేసిన తరువాత హోటల్ నుంచి కిలోమీటరు దూరంలో కారులో తీసుకువచ్చారు. అక్కడ కాలువలో పారేశారు. ఇది హర్యానాకు కొట్టుకువచ్చినట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News