Monday, December 23, 2024

బొగ్గు కుంభకోణంలో మాజీ ఎంపి దోషి: ప్రత్యేక కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు సంబంధించిన కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ దర్దా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తాతోసహా ఏడుగురిని దోషులుగా ప్రకటిస్తూ ఢిలీ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

విజయ్ దర్దా కుమారుడు దేవేందర్ దర్దా, ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులు కెఎస్ క్రోఫా, కెసి సమ్రియా, జెఎల్‌డి యావత్మాల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్ మనోజ్ కుమార్ జైస్వాల్‌ను కూడా దోషులుగా కోర్టు ప్రకటించింది. దోషులకు విధించే శిక్షా పరిమాణానికి సంబంధించిన వాదనలను జులై 18న వింటామని ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ బన్సాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News