Tuesday, January 21, 2025

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి భారీ షాక్ తగిలింది. శుక్రవారం బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రవీంద్రనాయక్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్‌కు సిఎం కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ఎమ్మెల్యేగా,

2004లో వరంగల్ ఎంపిగా పనిచేసిన రవీంద్రనాయక్ బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి 2019లో బిజెపిలో చేరి గత నెలలో బిజెపికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. బంజారా కమిషన్ ఏర్పాటులో బిజెపి అధిష్టానం నిర్లక్ష్యం వహిస్తోందని, తాను బిజెపిలో సీనియర్ లంబాడీ నేతగా ఉన్నా బిజెపి నేతలు ఏ విషయంలోనూ తనను సంప్రదించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News