- Advertisement -
తెలంగాణలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు షాక్ తగిలింది. ఆ రెండు పార్టీల నుంచి కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం నాంపల్లిలోని గాంధీ భవన్ లో బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బిజెపి నేత, మాజీ ఎంపీ సోయం బాబురావులు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది తమతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే కాంగ్రెస్ చేరబోతున్నారని ఇటీవల పలువురు మంత్రులు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే కాంగ్రెస్ లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది.
- Advertisement -