Monday, January 6, 2025

తెలంగాణ రావాల్సిన హక్కుల కోసం ఎన్నడు కేంద్రం దగ్గర రాజీ పడలేదదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ హక్కుల విషయంలో కేంద్రం వద్ద కెసిఆర్ ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడలేదని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై గత ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన స్పందర్భంగా బుధవారం తెలంగాణ భవన్‌లో వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో చాలా సార్లు కెసిఆర్ ప్రధాని మోడీని కలిశారని అన్నారు.

కెసిఆర్ ప్రధానిని కలిసిన ప్రతిసారి చూస్తామని చెప్పారు తప్పా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. విభజన చట్టంలో ముఖ్యంగా రహదారులు విషయంలో ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క హామీ కేంద్రం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాసిన లేఖలలే మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీకి ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రహదారులు విషయంలో తాను ఎన్నోసార్లు పార్లమెంట్‌లో మాట్లాడామని గుర్తు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోదీ కలవడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోషమని వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు.

ఎయిమ్స్ వచ్చిందే బిఆర్‌ఎస్ వల్ల
2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కరు మాట్లాడలేదని వినోద్‌కుమార్ విమర్శించారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ వచ్చింది అంటే దానికి కారణం బిఆర్‌ఎస్ పార్టీనేని స్పష్టం చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి మాత్రం నవోదయ విద్యాలయం కావాలని మోదీని అడగలేదని అన్నారు. సైనిక్ స్కూల్ తాము అధికారంలో ఉన్నప్పుడు అడిగామని గుర్తు చేశారు. ఆ స్కూల్ కోసం వరంగల్‌లో భూ సేకరణ చేశామని,అయితే ఒక్క రూపాయి కేంద్రం ఇవ్వదు మొత్తం మీరే చూసుకోవాలని చెప్పారని వివరించారు. అలాంటిప్పుడు సైనిక్ స్కూల్ కోసం కొత్తగా అడగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చిందే బిఆర్‌ఎస్ పార్టీ అని చెప్పారు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉందని తెలిపారు. బుల్లెట్ ట్రైన్లు అన్ని నార్త్ స్టేట్‌లకు ఇచ్చారని, హైదరాబాద్, విజయవాడ, మద్రాస్ వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని అడిగామని, అవి సిఎం రేవంత్‌రెడ్డి మాత్రం ప్రస్తావించలేదని ఆరోపించారు. విభజన చట్టంలో చెప్పినవి, చెప్పని వాటి కోసం ప్రతిసారి బిఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేసిందని, తాము ఎక్కడ తత్సారం చెయ్యలేదని చెప్పారు. మాజీ సిఎం కెసిఆర్ వందల లేఖలు ప్రధానికి రాసినా పట్టించుకోలేదని, అందుకే తాము అప్పటి నుంచి ప్రధానిని కలువలేదని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News