Sunday, January 19, 2025

కేజ్రీని ఉదహరించిన ఇమ్రాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో తనపై సాగుతున్న దురుసు ప్రవర్తన గురించి సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేస్తూ భారత్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ బెయిల్ పొందిన విషయాన్ని ఉదహరించారు. జాతీయ జవాబుదారీ ఆర్డినెన్స్ (ఎన్‌ఎఒ) సవరణలకు సంబంధించిన కేసులో పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫయెజ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు గురువారం హాజరైన పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాన్ (పిటిఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ 2022 ఏప్రిల్‌లో తన అధికార చ్యుతి దగ్గర నుంచి తాను ఎదుర్కొన్న ‘కక్ష సాధింపు చర్యల’ గురించి ఫిర్యాదు చేశారు.

బెంచ్‌లోని ఇతర న్యాయమూర్తులు అమీనుద్దీన్ ఖాన్, జమాల్ ఖాన్ మందోఖెల్, అథర్ మినల్లాహ్, సయ్యద్ హసన్ అఝర్ రిజ్వి. లక్షలాది మంది అనుయాయులు ఉన్న పార్టీకి అధినేత అయిన ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండడం దురదృష్టకరం అని జస్టిస్ మినల్లాహ్ వ్యాఖ్యానించారు. తనపై అణచివేత చర్యల గురించి ఇమ్రాన్ ఖాన్ ఫిర్యాదు చేస్తూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తన పార్టీ కోసం ప్రచారం నిమిత్తం భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు సర్వోన్నత న్యాయస్థానం ఆయనను బెయిల్‌పై విడుదల చేసిందని, కానీ తాను అప్రకటిత ‘మార్షల్ లా’ కింద పాకిస్తాన్‌లోఅణచివేతను ఎదుర్కొంటున్నానని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు తనను దూరంగా ఉంచేందుకు ఐదు రోజుల ముందు తనను దోషిగా నిర్ధారించారని 71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News