Wednesday, January 22, 2025

ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం జైలులో ఉన్నపాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ లభించింది. సైనిక స్థావరాలపై ఇమ్రాన్ అనుచరులు చేసిన దాడులకు సంబంధించి దాఖలైన 12 కేసులలో ఏటీసీ జడ్జి మాలిక్ ఇజాన్ ఆసిఫ్.. ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులలో ఇతర నిందితులంతా బెయిల్ పై ఉండగా ఇమ్రాన్ కు బెయిల్ తిరస్కరించడం సబబు కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ఐదు లక్షల రూపాయల పూచీకత్తుపై ఇమ్రాన్ కు బెయిల్ ఇచ్చారు. ఇదే కేసులో అరెస్టయి, జైలులో ఉన్న మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా బెయిల్ లభించింది. అయితే బెయిల్ లభించినా కీలకమైన తోషఖానా, సైఫర్ కేసుల్లో దోషిగా తేలినందువల్ల ఇమ్రాన్ బయటకు వచ్చే అవకాశం లేదు.

తాజాగా జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడుగా ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చెప్పుకోదిగిన స్థానాలను గెలుచుకోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News