Friday, January 10, 2025

తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ శిక్ష నిలిపివేత

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాక్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోపాఖానా కేసులో ఆయనకు ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపివేసింది. తాషాఖానా అవినీతి కేసులో తనకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు సోమవారమే తీర్పును రిజర్వు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమిర్ ఫారూఖ్, జస్టిస్ తారీఖ్ మహ్మద్ జహంగిరిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆ తీర్పును ప్రకటించింది.

Also Read: రక్షాబంధన్ కు మోడీ గిఫ్ట్…

ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను ‘తోషాఖానా’ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో నమోదైన కేసులో ఇస్లామాబాద్ లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. అంతేకాకుండా ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. తీర్పు వెలువడిన వెంటనే అరెస్టయిన ఇమ్రాన్, ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ లోని అటక్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమం లోనే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేయగా, ఇస్లామాబాద్ హైకోర్టు దాన్ని నిలిపివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News