Monday, December 23, 2024

పార్లమెంట్ కొత్త భవనం దేశ ప్రజల ఆస్తి: మాజీ ప్రధాని దేవెగౌడ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి తప్పకుండా తాను హాజరవుతానని, ఇది బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలమా బహిష్కరించడానికి .. ఇది దేశ ప్రజల పన్నుచెల్లింపు మొత్తాలతో నిర్మించిన ప్రజల ఆస్తి అని మాజీ ప్రధాని దేవెగౌడ గురువారం స్పష్టం చేశారు. జెడి(ఎస్)అధినేత అయిన దేవెగౌడ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ అంతస్సమీక్ష సమావేశంలో

మాట్లాడుతూ రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించడానికి చాలా కారణాలు ఉంటాయని, కానీ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో రాజకీయాలు చొప్పించడం తాను ఇష్టపడబోనని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభలకు తాను ఎన్నుకోబడ్డానని, రాజ్యాంగ పరిధి మేరకు తన విధిని నిర్వహిస్తానని , రాజ్యాంగ విలువల రక్షణ కోసం పనిచేస్తానని, ఇప్పటికీ తాను రాజ్యసభ సభ్యుడి గానే ఉన్నానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News