Monday, March 10, 2025

పదవి వీడి ప్రియుడితో కొత్త జీవితం

- Advertisement -
- Advertisement -

హాకే బే : పలు ఊహాగానాలకు తెరదించుతూ న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డర్న్ తన ప్రియుడు క్లార్క్ గేఫోర్డును పెళ్లి చేసుకున్నారు . వీరి ఎంగేజ్‌మెంట్ చాలా ఏళ్ల క్రితమే జరిగింది. పలు కారణాలతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అత్యంత రమణీయ స్ఠలిగా పేరొందిన హాకే బేలో వీరు ఒక్కటయ్యారు.అత్యంత సమర్ధవంత పాలన రికార్డు ఉన్న జెసిండా గత ఏడాది జనవరిలో రాజకీయాలనుంచి వైదొలుగుతూ , పదవిని వీడారు. కాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమ వ్యవహారం ఐదేళ్లుగా సాగుతూ వచ్చింది.

మీడియా పలు కథనాలు ఇప్పుడు నిజం అయ్యాయి. దేశానికి పలు క్లిష్టతల దశల్లో ఆమె ప్రధానిగా వ్యవహరించారు. 37 ఏండ్ల వయస్సులోనే ఆమె దేశానికి సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. పరిపాలనా దక్షతను చాటారు. జీవితం ఏమిటనేది జీవితమే చెపుతుందని తరచూ చెపుతూ వచ్చిన జెసిండా ఇప్పుడు టీవీప్రజెంటర్ , ప్రియుడుతో కలిసిసాగింది. వివాహానికి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్‌హిప్‌కిన్స్, కొందరు క్రికెటర్లు, నటులు హాజరయినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News