Monday, January 27, 2025

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్యపరిస్థితి బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మన్మోహన్ సింగ్‌ను ఏ కారణంగా హాస్పిటల్‌లో చేర్పించారన్నది వెల్లడి కాలేదు. ఆయన ప్రస్తుత వయస్సు 92 ఏళ్లు. 2024 ఆరంభం నుంచే అనారోగ్యంతో బాధఫడుతున్నారు. పైగా అప్పటి నుంచి ప్రజల్లోకి రావడం లేదు. చివరిసారిగా ప్రజల్లో కనిపించింది 2024 జనవరిలో. అది కూడా తన కూతురు పుస్తకావిష్కరణ సందర్భంగా ఢిల్లీలోని ‘ది ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్(ఐఐసి)లో. మన్మోహన్ సింగ్ 2024 ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ అయ్యారు. రాజ్యసభలో సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన(1999లో) ఏకైక సిక్కు మతస్థుడు ఆయన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News