Friday, December 27, 2024

సంస్కరణల ‘సింగ్’ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

దేశాన్నిదివాలా అంచుల్లోంచి గట్టెక్కించిన ఆర్థిక నిపుణుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ గురువారం కన్నుమూశారు.అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఏడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం విద్యాసంస్థలకు సెలవును ప్రకటించింది.

ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జననం..
దేశ విభజన సమయంలో భారత్‌కు వచ్చిన
మన్మోహన్ కుటుంబం
33ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా
కొనసాగిన ఆర్థిక వ్యవహారాల
నిపుణుడు
13వ ప్రధానిగా దేశానికి సేవలందించిన మన్మోహన్
ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన
తొలి హిందూయేతర వ్యక్తి
పదేళ్ల పాలనలో
అపురూప విజయాలు
ప్రధానిగా రోజుకు 18గం. పని
మన్మోహన్ హయాంలోనే
వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు
దేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దిన నేత
దేశం విశిష్ట వ్యక్తిని
కోల్పోయింది: ప్రధాని మోడీ
అపార జ్ఞానం, సమగ్రతతో దేశాన్ని నడిపించారు: రాహుల్
దేశం గొప్ప ఆర్థిక నిపుణుడిని కోల్పోయింది: సిఎం రేవంత్

మన్మోహన్ సింగ్ సాధించిన 10 ముఖ్యమైన విజయాలు

ఆర్థిక సంస్కరణలు

హక్కు చట్టం, 2005
(ఇప్పుడు ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎ)సివిల్
న్యూక్లియర్ డీల్, 2008
హక్కు చట్టం, 2009
ఆహార భద్రతా
చట్టం, 2013
గ్రామీణ ఆరోగ్య
మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)
జిడిపి వృద్ధి రేటు
చతుర్భుజి వంటి
మౌలిక సదుపాయాల
ప్రాజెక్టులు

విదేశాంగ విధానం

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీ లోని ఎయిమ్స్‌లో కన్ను మూశారు. ఆర్థిక సంస్కరణల సూత్రధారిగా,యూపీఏ కూటమికి ప్రధానిగా 2004-2014 మధ్య కీలక మైన బాధ్యతలు నిర్వహించారు. 1991లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలోఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో కుటుంబ సభ్యులు గురువారం సాయింత్రం ఢిల్లీ లోని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. ఆయనకు తీవ్ర అస్వస్థతతో ఉండడంతో ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ , మన్మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఎయిమ్స్‌కు ప్రముఖులు రానున్న నేపథ్యంలో పోలీస్ భద్రత పెంచారు. కర్ణాటక లోని బెల్గాం పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఆర్బీఐ గవర్నర్ హోదాలో కీలకపాత్ర పోషించారు. 1991 అక్టోబరు 1 నుంచి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా , ఆ తరువాత 2019 ఆగస్టు 20 నుండి,2024 ఏప్రిల్ 3 వరకు రాజ్యసభ సభ్యునిగా రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీ లోని ఎయిమ్స్‌లో కన్ను మూశారు. ఆర్థిక సంస్కరణల సూ త్రధారిగా, యూపీఏ కూటమికి ప్రధా నిగా 200414 మధ్య కీలక మైన బాధ్యతలు నిర్వహించారు. 1991లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలోఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దిగ జారడం తో కుటుంబ సభ్యులు గురువారం సాయింత్రం ఢిల్లీ లోని ఎయిమ్స్ దవాఖానకు తరలిం చారు. ఆయనకు తీ వ్ర అస్వస్థతతో ఉండడంతో ఎమర్జెన్సీ వార్డు లోవైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబ స భ్యులు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాం ధీ, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వెంటనే ఎయి మ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ , మన్మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఎయిమ్స్‌కు ప్రముఖులు రానున్న నేపథ్యంలో పోలీస్ భద్రత పెం చారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఆర్బీఐ గవర్నర్ హోదాలో కీలకపాత్ర పోషించారు. 1991 అక్టోబరు 1 నుంచి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా , ఆ తరువాత 2019 ఆగస్టు 20 నుండి,2024 ఏప్రిల్ 3 వరకు రాజ్యసభ సభ్యునిగా రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.

వివాదరహితుడు…

ఎటువంటి వివాదాలు లేకుండా పది సంవత్సరాల పాటు భారత 13వ ప్రధానిగా మన్మోహన్ సింగ్ పని చేశారు. ఆర్థిక మంత్రిగా చెరగని ముద్ర వేశారు. సుధీర్ఘకాలం పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. 1982-1985 వరకు ఆర్‌బిఐ గవర్నర్ గా పనిచేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 2024 ఏప్రిల్లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేశారు. 1998 2004 రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేశా రు. 1987లో మన్మోహన్ సింగ్ పద్మ విభూషణ్ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. 1993 లో ఉత్తమ ఆర్థిక మంత్రి పురస్కారం అందుకున్నారు. యూరో మనీ అవార్డు కూడా ఆయనను వరించింది. 2017 మన్మోహన్ సింగ్ కు ఇందిరాగాంధీ పురస్కారం ఆయన సొంతమైంది.

ప్రధాని మోడీ సంతాపం

భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్‌ను కోల్పోయింది. ఎంతో నిరాడంబర వ్యక్తిగా ఉండే ఆయన ఆర్థిక వేత్తగా ఎదిగారు. ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితోపాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారు. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపడేందుకు ఎంతో కృషి చేశారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరుచూ మాట్లాడుకునేవాళ్లం. పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేవాళ్లం.ఆయన జ్ఞానం , వినయం ఎల్లప్పుడు ప్రస్ఫుటించేవి. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి.” అని మోడీ మన్మోహన్ సింగ్ తో ఉన్న పరిచయాన్ని వివరించారు.

దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు : ఉపరాష్ట్రపతి

మన్మోహన్ సింగ్ భారత దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు. పద్మవిభూషన్ అవార్డు గ్రహీత అయిన ఆయన , ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా పేరు గడించారు. ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠినమైన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు. దేశ అభివృద్ధి కి ఎన్నో ద్వారాలు తెరిచారు. ఉపరాష్ట్రపతిగా ఆయన తో ఎంతో సంభాషణలు జరిపాను. ఆర్థిక విధానం ప ట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం , దేశ పురోగతి పట్ల ఆయనకున్న అచంచల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దేశం మహోన్నత వ్యక్తిని కో ల్పోయింది.ఆయన సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

గురువు మార్గదర్శిని కోల్పోయాను : రాహుల్

మన్మోహన్ మృతిపట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఒక గురువు, మార్గదర్శిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. అపార జ్ఞానం, సమగ్రతతో ఆయన దేశాన్ని ముందుకు నడిపించారని రాహుల్ కొనియాడారు. దేశం దూరదృష్టి కలిగిన నేతను దేశం కోల్పోయిందని ఎఐసిసి చీఫ్ ఖర్గే విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయంపై ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన జాతికి సేవచేసే తన కమిట్మెంట్ విషయంలో దృఢసంకల్పంతో మెలిగేవారని, తనపై వక్తిగత దాడులు జరిగినప్పటికీ ఆయన కమిట్మెంట్‌కే కట్టుబడి ఉండేవారని అన్నారు. సర్దార్ మన్మోహన్ సింగ్‌లా రాజకీయాల్లో ప్రేరణ ఇవ్వగలిగే వారు కొందరే ఉంటారని ఆమె ‘ఎక్స్’ పోస్ట్‌లో రాశారు.

బెల్గావి నుంచి హుటాహుటిన ఢిల్లీకి…

డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలియగానే కర్నాటకలోని బెల్గావి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ వెంటనే సంబ్రా(కర్నాటక) విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి

మన్మోహన్ సింగ్ మరణం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీ వ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట స మయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహా రావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియా డారు.పివి మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉ న్నత శిఖరాలకు చేరుకున్న భరత మాత బిడ్డ గా కొని యాడారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భమన్నారు.

మన్మోహన్‌సింగ్ నవభారత నిర్మాత
సిఎం రేవంత్‌రెడ్డి

మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక వేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది అని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఆ యన మృతికి సం తాపం తెలిపారు. ఆయన తీసుకున్న అసామాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఒకటి. ఆయన అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News