- Advertisement -
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే కీలక మార్గమని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. కాగా, కరోనా వైరస్ రెండో దశలో అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో దేశంలో పాజిటీవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
Ex PM Manmohan Singh test positive for Corona
- Advertisement -