Monday, December 23, 2024

రాజపక్స సోదరులకు సుప్రీంకోర్టు షాక్

- Advertisement -
- Advertisement -

Ex PM Rajapaksa Barred From Leaving Sri Lanka

28 వరకు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశం

కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరులు మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ మంత్రి బసిల్ రాజపక్సదేశం విడిచి వెళ్లరరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. గొటబాయ విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో ఆయన సోదరులిద్దరూ ఈ నెల 28 వరకు దేశం విడిచి వెళ్లకూడదదని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలనుటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. మహింద, బసిల్‌లపై ట్రాన్స్‌పరెన్సీ శ్రీలంక, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు కేంద్ర బ్యాంకు మాజీ గవర్నర్లు సహా ముగ్గురు అధికారులు కూడా కోర్టు అనుమతి లేకుండా ఈ నెల 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని కూడాఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News