Sunday, December 22, 2024

ఆర్‌జి కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకల ఆరోపణల సందర్భంగా సంస్థ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సిబిఐ సోమవారం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్‌జి కర్ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీపై ఆగస్టు 9 నాటి హత్యాచారం ఆరోపణ సందర్భంగా ఘోష్‌ను సిబిఐ కోల్‌కతాలోని తమ సాల్ట్ లేక్ కార్యాలయంలో సోమవారం 13వ రోజు ప్రశ్నించింది. ఆ తరువాత ఘోష్‌ను సిబిఐ అవినీతి నిరోధక విభాగం ఉండే నిజామ్ ప్యాలెస్ ఆఫీస్‌కు తీసుకువెళ్లి అరెస్టు చేసినట్లుగా చూపించారు. ఘోష్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో అనేక విధాలుగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అఖ్తర్ అలీ ఫిర్యాదులు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News