ఒక రీసర్చ్ సంస్థలో ఒక చైనీస్ ఇంజనీర్‌కు విదేశీ వేగు సంస్థలకు రహస్య సమాచారం విక్రయించినందుకు మరణ శిక్ష విధించినట్లు చైనా స్టేట్ సెక్యూరిటీ మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. రీసర్చ్ సంస్థకు చెందిన ఇంజనీర్ లియూ విదేశీ సంస్థలకు నిఘా సమాచారం విక్రయానికి ‘పక్కా ప్రణాళిక’తో పని చేసినట్లు మంత్రిత్వశాఖ వ్యాసాన్ని ఉటంకిస్తూ అధికార మీడియా తెలియజేసింది. చైనా జాతీయ భద్రత అధికారులు గూఢచర్యం కేసు గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో లియూ అక్రమంగా ప్రభుత్వ రహస్యాలను కాపీ చేసి, విదేశీ వేగు సంస్థలకు విక్రయించాడు. లియూ గూఢచర్యం సాగించి, అక్రమంగా ప్రభుత్వ రహస్యాలను విక్రయించినందుకు దోషిగా నిర్ధారించి జీవితాంతం రాజకీయ హక్కులు లేకుండా మరణ శిక్ష విధించినట్లు మంత్రిత్వశాఖ వ్యాసాన్ని ఉటంకిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘గ్లోబల్ టైమ్స్’ తెలియజేసింది. తన పట్ల అన్యాయంగా వ్యవహరించి, పదోన్నతులు నిరాకరించారని విశ్వసించిన తరువాత లియూలో నిరసన భావన చోటు చేసుకున్నదని, రాజీనామా చేసే ముందు అతను ప్రతీకార దృక్పథంతో, బ్లాక్‌మెయిల్ చేయాలనే తలంపుతో భారీ స్థాయిలో రహస్య సమాచారాన్ని గోప్యంగా కాపీ చేశాడని ఆ వ్యాసం వివరించింది.
గూఢచర్యంపై చైనాలో ఒక రీసర్చర్‌కు మరణ శిక్ష
- Advertisement -
- Advertisement -
- Advertisement -