Monday, December 23, 2024

ఎమ్మార్వో ఆఫీసులో మాజీ సర్పంచ్ అత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పొలానికి వెళ్ళే దారి సమస్య పరిష్కారంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎపిలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఓ మాజీ సర్పంచ్ అత్మహత్యయత్నం చేశాడు. చెంగుబళ్ల పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్ తన పొలం దారి సమస్య కోసం పరిష్కారం కోరుతూ స్పందన కార్యక్రమంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. వినతులు స్వీకరించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. వారం రోజుల కిందట ఆర్డీవోను కలిసి సమస్యను విన్నవించాడు. తాజాగా మంగళవారం క్షేత్ర పరిశీలన చేపట్టిన అధికారులు గోపాల్ సమస్యను పరిష్కరించలేదు. దీంతో అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన గోపాల్ ఎమ్మార్వో ఆఫీసుకు తాడుతో వచ్చి ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు.

Ex Sarpanch Attempt Suicide in Kuppam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News