Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ సర్పంచ్‌లు

- Advertisement -
- Advertisement -
  • కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బిఆర్‌ఎస్‌లో చేరేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌లు జయరాం, కృష్ణ, ఉప సర్పంచ్ ఆంజనేయులు, మాజి ఉప సర్పంచ్ లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, మల్లేశం, దుర్గయ్య, సయోద్దీన్‌లను రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్‌రావు బిఆర్‌ఎస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చింతా ప్రభాకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విఠల్, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు విజయ భాస్కర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పాండురంగం,నాయకులు రుక్మోద్దీన్, గోవర్దన్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, మాణిక్ ప్రభు,మల్లాగౌడ్, ప్రకాష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News