Monday, January 20, 2025

కాంగ్రెస్‌కు మాజీ కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ రాజీనామా..

- Advertisement -
- Advertisement -

Ex Union Minister Ashwani Kumar Resign to Congress

న్యూఢిల్లీ: మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గడచిన 46 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అశ్వనీ కుమార్ మంగళవారం ఉదయం తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. తాను పార్టీ వెలుపల ఉండి జాతీయ సమస్యలపై పోరాడతానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ముఖ్యంగా ఈనెల 20న పంజాబ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అశ్వనీ కుమార్ కాంగ్రెస్‌ను వీడడం ఆ పార్టీకి నష్టమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇటీవల కాలంలో పార్టీ సీనియర్లు పలువురు పార్టీని వీడుతుండడం గమనార్హం. ఇటీవలే మరో మాజీ కేంద్ర మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

Ex Union Minister Ashwani Kumar Resign to Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News