Thursday, January 23, 2025

నాకు ప్రాణహానీ ఉంది : నటుడు నరేష్

- Advertisement -
- Advertisement -

మాజీ భార్య రమ్య పై నటి నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. రమ్య,రోహిత్ శెట్టి వల్ల ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించారు. ఆస్తికోసం రమ్య తనను చంపేందుకు ప్రయత్నించిందని, సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకొని తనను చంపాలనుకుందని నరేష్ తెలిపారు. రమ్య వల్ల తన నరకయాతన అనుభవిస్తున్నానని, ఘటన పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని నటుడు నరేష్ శుక్రవారం మీడియా ద్వారా తెలిపారు.

పెళ్లి అయిన కొన్ని నెలల నుండే తనని వేదింపులకు గురి చేసిందని, తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు పెట్టిందని, రమ్యా కు తనకు 2012 లో రణ్వీర్ పుట్టాడు. అప్పటి నుంచి కూడా తనలో ఎటువంటి మార్పు లేదని నరేష్ అన్నారు. తనకు తెలియకుండానే పలు బ్యాంకులు,  వ్యక్తుల తన పేరు చెప్పి రమ్య లక్షల్లో అప్పులు చేసిందని, అప్పులు తీర్చుకునేందుకు 10 లక్షలు చెల్లించానని , తన కుటుంబ సభ్యుల నుండి మరో 50 లక్షలు కూడా తీసుకున్నదని తెలిపారు.

తన ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నిస్తుందని, అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తనను వేధించేవారని అన్నారు. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డితో ఫోన్ చేపించి బెదిరించిందని ,  తనను చంపేస్తారన్న భయంతో ఒంటరిగా ఎక్కడికి వెళ్లడంలేదని, రమ్య తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా తన ఫోన్ హ్యాక్ చేసి పర్సనల్ మెసెజ్ లు చూసేదని తెలిపారు. 2022 ఏప్రిల్ లో కొంతమంది అగంతకులు నా ఇంట్లో చొరబడ్డారని, 24 లక్షలు రికవరీ చేయడానికి వచ్చామని మాయ మాటలు చెప్పారు,  ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని నరేష్ తెలిపారు. రమ్య వేధింపులు భరించలేకపోతున్నానని , కోర్టు ద్వారా  తనకు విడాకులు ఇప్పించాలని నటుడు నరేష్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News