Thursday, January 23, 2025

మాతృభాషలో పరీక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : యూనివ ర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) డిగ్రీ చ దివే విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇ క నుంచి తాము ఇంగ్లీష్ మీడియంలో కో ర్సు చదువుతున్నప్పటికీ పరీక్షలను మాతృ భాషలో రాసేందుకు వీలును కల్పించింది. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యత కల్పించేలా దేశంలోని అన్ని యూనివర్సిటీలకు బుధవారం యుజిసి కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో కోర్సులను అభ్యసించినప్పటికీ.. వారు స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించినట్టు యుజిసి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం. జగదీష్ కుమార్ తెలిపారు. పాఠ్యపుస్తకాలను రూపొందించడంతో పాటు బోధన- అభ్యాసన ప్రక్రియ మాతృభాష/ స్థానిక భాషలో జరిగేందుకు ఉన్నత విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని యుజిసి పేర్కొన్నారు.

ఈ కృషిని బలోపేతం చేయడం, పాఠ్యపుస్తకాలను మాతృభాష/స్థానిక భాషల్లో తయారుచేయడం, ఇతర భాషలనుంచి ప్రామాణిక పుస్తకాలను అనువదించడంతో పాటు బోధన- అభ్యసన ప్రక్రియలో వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. బోధనకు అవసరమైన ఫ్యాకల్టీ సమకూర్చుకోవాల్సిన పరిస్థితిని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆంగ్ల మాధ్యమాల్లో కోర్సులు అభ్యసించినప్పటికీ.. స్థానిక భాషల్లోనే సమాధానాలు రాసేలా అనుమతించాలని కోరారు. అలాగే, స్థానిక భాషల్లో పుస్తకాల అనువాదాన్ని పోత్సహించాలని, స్థానిక భాషల్లోనే బోధన- అభ్యాసన ప్రక్రియ ఉపయోగించాలని యూనివర్సిటీలను కోరుతున్నట్టు తెలిపారు.
27 శాతం ఉన్న ప్రవేశాలు 50 శాతానికి పెంచడమే లక్షం
ఒక విద్యార్థి తనకు నచ్చిన కోర్సును ఇంగ్లిష్ మీడియంలో తీసుకున్నా సరే వారి స్థానిక లేదా మాతృ భాషలో పరీక్షలు రాయాలనుకుంటే అనుమతివ్వాలని యుజిసి ఛైర్మన్ స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా స్థానిక భాషల్లో బోధన, పరీక్షల విధానం అత్యంత కీలకమైందిగా పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నత విద్యలో మరింత రాణిస్తారని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యలో ఇప్పుడున్న 27 శాతం ప్రవేశాల నిష్పత్తిని 2035 నాటికి 50 శాతానికి తీసుకెళ్ళడం లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని యూనివర్సిటీలు పరీక్షల్లో విద్యార్థులు తెలుగుతో సహా స్థానిక భాషలలో రాసేందుకు అనుమతించాలని యుజిసి ఛైర్మన్ కోరారు. ఈ నేపథ్యంలో మాతృభాషలో బోధనకు గల అవకాశాలపై సమగ్ర వివరాలను ఆన్‌లైన్ ద్వారా పంపాలని వర్శిటీలను, ఉన్నత విద్యా మండళ్ళను కోరారు.
విద్యార్థులకు మరింత ప్రయోజనం
ఓ విద్యార్థికి తనకు నచ్చిన భాషలోనే విద్యను అభ్యసించే విధంగా దేశంలోని విద్యా విధానంలో మార్పులు అవసరమని చాలా కాలంగా చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో పలు ఉన్నత విద్య కోర్సులను ఇంగ్లీష్‌లోనే బోధిస్తున్నారు. దీంతో ఇంగ్లీష్ అంటే భయపడే విద్యార్థులు మాతృ భాషలో చదువుకునే వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో స్థానిక భాషలో విద్యను బోధిస్తే విద్యార్థులు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉన్నత విద్యను ఇంగ్లీష్ మీడియంలోనే చదవలేక కొంతమంది విద్యార్థులు ఆత్మన్యూనతకు గురవతున్నారని, స్థానిక లేదా మాతృభాషలో- అభ్యాసన ప్రక్రియ ఉపయోగించడం, పరీక్షలు రాసే అవకాశం కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నారు. స్థానిక/మాతృభాషలలో ఉన్నత విద్య అందుబాటులోకి రావడంతో ఇంగ్లీష్ భాష రాక ఇబ్బంది పడే విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.
ఈ వివరాలు ఇవ్వండి : వర్సిటీలను కోరిన యుజిసి
ఉన్నత విద్యలో విభాగాల వారీగా పుస్తకాలు, రిఫరెన్స్ బుక్స్, స్టడీ మెటీరియల్ స్థానిక భాషలో ఏమేర అందుబాటులో ఉన్నాయో తెలపాలి. ఇతర భాషల్లో ఉన్న పుస్తకాల తర్జుమాకు గల అవకాశాలను వివరించాలి.
– స్థానిక భాషలో బోధించేందుకు బోధకులు ఏమేర అందుబాటులో ఉన్నారు. సబ్జెక్ట్ నిపుణులు, స్కాలర్స్ స్థానిక భాషల్లో తర్జుమా చేసేవాళ్ళు ఏమేర ఉన్నారు.
– స్థానిక భాషల్లో పుస్తకాల ముద్రణకు గల అవకాశాలు, ప్రిటింగ్, పబ్లిషర్ల వివరాలు తెలపాలి. స్థానిక భాషల్లో విద్యార్థులు ఏమేర పరీక్షలు రాయగలరో వివరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News