Wednesday, January 22, 2025

సమీకృత జిల్లా కార్యాలయ పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడి ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ల గదులలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఛాంబర్‌లో సుందరీకరణ లైటింగ్ ఏర్పాట్ల పై గుత్తేదారుతో చర్చించారు. అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ పనులు వేగంగా జరిగేలా చూడాలని, ఈ నెల 24న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీ దుగా ప్రారంభోత్సవం కానునందున పనులు వేగం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు.అనంతరం సూర్యాపేట పట్టణంలో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ సముదాయాన్ని పరిశీలిం చి మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డికి తగు సూచనలు చేశారు.

సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ప్రజలకు రైతులకు, వ్యాపారులకు అన్ని మౌలిక సదుపాయాలతో సి ద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్‌సి నరసింహ నాయక్, ఈఈ యాకోబ్, ఏఈఈ ప్రీతి, గుత్తేదా రు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News