Thursday, January 23, 2025

జన గర్జన సభ ఏర్పాట్ల పరిశీలన

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయన అనుచర బృందం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా జూలై 2న ఆదివారం ఖమ్మంలో నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన సభను జయప్రదం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన గురువారం తొలుత నాయకన్ గూడెంలో పీపుల్స్ మార్చ్ ను దిగ్విజయంగా పూర్తి చేసిన భట్టి ని కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మాణిక్ రావు టాక్రే కు పొంగులేటి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఖమ్మం నగర శివారులో ఎస్ ఆర్ గార్డెన్ సమీపంలో వంద ఎకరాల స్ధలంలో జూలై 2న ఏర్పాటు చేస్తున్న తెలంగాణ జనగర్జన సభా వేదికను పొంగులేటి, జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం పొంగులేటి క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఠాక్రే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి రాకను స్వాగతిస్తున్నామన్నారు. జూలై2న ఇక్కడ జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని ఈనేపథ్యంలో ఈ సభకు అంచనాలకు మించి జనం వచ్చే అవకాశం ఉన్నందున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరువుతారని ఆయన తెలిపారు.

  • ఎన్ని అడ్డంకులొచ్చినా సభ సక్సెస్ అవుతుంది : పొంగులేటి

జూలై 2న ఖమ్మంలో జరిగే తెలంగాణ జనగర్జనకు ఎన్ని అడ్డంకులు సృష్టించిన తెలంగాణ జన గర్జన సభ కనీవిని ఎరుగని రీతిలో ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా జరిగి తీరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మద్దినేని బెబి స్వర్ణకుమారి, కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News