Sunday, December 22, 2024

జనగర్జన సభ ఏర్పాట్ల పరిశీలన

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరం వద్ద ఆయనతో ముచ్చటించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జనగర్జన సభ ఇంచార్జ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై రెండవ తేదీన జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు హాజరుకానున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నియోజవర్గానికి ఇద్దరు చొప్పున ఇన్చార్జిలను నియమిచామని, వారు పూర్తి బాధ్యత తీసుకొని సభకు భారీగా జన సమీకరణ చేయాలని సూచించారు.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా ప్రతి ఒక్కరు సభ విజయవంతం చేయడానికి కృషి చేయాలని తెలిపారు. భారీ బహిరంగ సభలో పలువురు నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. టిపిసిసి నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌లు మాట్లాడుతూ.. తెలంగాణ జనగార్జన సభను విజయవంతం చేసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచు కోట అని నిరూపించాలని కోరారు. అనంతరం జనగర్జన సభాస్థలిని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి, డిసిసి నాయకులతో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News