Sunday, December 22, 2024

పరీక్షలు వాయిదా వేయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : డిఎస్సీ పరీక్షలు వాయిదా వేసే ది లేదని, త్వరితగతిన ఉద్యోగా లు ఇవ్వడమే తమ లక్షమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇదే చివరి డీఎస్సీ కాదని, త్వరలో ఆరు వేల పోస్టులతో మరో డి ఎ స్సీ ఉంటుందన్నారు. మూడు నె లల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఇదే చివరి డీఎస్సీ కాదని, త్వరలో ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీ ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసమని తెలిపారు. మూడు నెలల్లో 30 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చామన్నారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. 19,717న మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీలు చేసినట్లు తెలిపారు.

అందుబాటులో డీఎస్సీ హాల్ టికెట్లు…
ఈనెల 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులోకి ఉంచామని, ఇప్పటికే 2,00,500 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని భట్టి విక్రమార్క చెప్పారు. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని అన్నారు. డిఎస్సీకి అభ్యర్థులు కొన్ని నెలలుగా సిద్ధం అవుతున్నారని, అందుకే జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పదేళ్లలో ఎన్నడూ గ్రూప్-1 నిర్వహించలేదన్న విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి గు ర్తు చేశారు. విద్యావ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యనందించాలని డీఎస్సీ ప్రకటించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని విమర్శించారు. పదేళ్లు డీఎస్సీని గత ప్ర భుత్వం నిర్వహించలేదన్నారు. ఎన్నికలకు ముం దు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్ల కోసం తాపత్రయపడ్డారని ఆరోపించారు.

ఐదు వేలకు నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించనందుకు తమ ప్రభుత్వం రాగానే 11 వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తు చేశారు. గ్రూప్ -2 ను ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేశారు. తమ ప్రభుత్వం నిర్వహించడానికి కృషి చేస్తోంది. పరీక్షలు అన్నిసార్లు వాయిదా వేయడం సరికాదు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం. హాస్టల్ వెల్ఫేర్‌కి సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాం. ఇదే చివరి డీఎస్సీ కాదు మరిన్ని తీస్తాం. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించాం. గ్రూప్-3 కూడా నిర్వహించలేకపోతే మళ్లీ మేం షెడ్యూల్ చేశాం. ఇవన్నీ నిరుద్యోగులకు నష్టం కలగవద్దన్నదే మా ప్రయత్నమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

రద్దు కుదరదు..
కేసిఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాలకోసమని తెలిపారు. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితం తె లంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టి 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు. విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యానందించాలని డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. గాంధీభవన్‌లో భట్టివిక్రమార్క మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పదేళ్లు డీఎస్సీని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్లకోసం తాపాత్రయ పడ్డారని విమర్శించారు. 5వేల నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించకపోవడంతో తమ ప్రభుత్వం రాగానే 11వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తుచేశారు. కొంతమంది పోస్ట్‌పోన్ చేయమని ధర్నాలు చేస్తున్నారని అలా చేయడం తగదని, దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించామని అన్నారు. గ్రూప్ 2 కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేసిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రూప్ 3 కూడా నిర్వహించలేకపోతే మళ్లీ తాము షెడ్యూల్ చేశామని అన్నారు. ఇవన్నీ నిరుద్యోగులకు నష్టం కలగవద్దని తమ ప్రయత్నమని వివరించారు.

ఇవి కాక వివిధ శాఖల్లో పోస్టులు 13321 టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీని కూడా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని వివరించారు. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అందరూ మంచిగా ప్రిపేరై ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్య ను అందించాలని కోరుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News