Friday, December 27, 2024

21, 22 తేదీల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు పరీక్షలు నిర్వహించనుంది. అందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష సెంటర్లలో తగిన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా, తిరిగి ఇంటికి వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులను నడుపనున్నది. బస్సులు ఎక్కడంతో పాటు దిగడానికి ఇబ్బంది లేకుండా బస్టాండ్‌లో ప్రత్యేకంగా అధికారులను నియమించడంతో పాటు స్టాపులో బస్సులను సక్రమంగా ఆపడం, అవసరమైన రూట్లో వెళ్లేలా అభ్యర్థులకు ఆర్టీసీ సిబ్బంది. మార్గనిర్దేశం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News