Thursday, January 23, 2025

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి : సబిత

- Advertisement -
- Advertisement -

Exams write with confidence

మన తెలంగాణ / హైదరాబాద్ : శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని మంత్రి అన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులు ఇష్టంతో పరీక్ష రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాక్షించారు. విద్యార్థులెవరూ భయానికి, ఆందోళనకు గురికావద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీ డియట్ పరీక్షలకు 9,07,393 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందుకోసం 1443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు వార్శిక పరీక్షలను నిర్వహించలేక పోయామని, ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల సందర్భంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా తగు జాగ్రత్తలతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం 70 శాతం సిలబస్ నుండి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతోందని, ప్రశ్నల చాయిస్ పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ప్రత్యేక గుర్తింపు పొందడానికి ఈ పరీక్షలను నాందిగా, భవిష్యత్తుకు ఒక పునాదిగా భావించాలని కోరారు. వేసవి కాలం దృష్టా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షలు బాగా రాసి వారి తల్లిదండ్రుల కలను నిజం చేయాలని మంత్రి కోరారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. సమయానికి ముండే పరీక్షా కేంద్రాలకు చేర్చే విధంగా ప్రణాళిక చేసుకోవాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సబితి ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థించారు. విద్యార్థులెవరైనా మానసిక వత్తిడికి గురైతే ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005999333 కు ఫోన్ చేసి విలువైన సలహాలు పొందవచ్చని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News