Sunday, February 23, 2025

తవ్వారు… వదిలేశారు

- Advertisement -
- Advertisement -

గద్వాల రూరల్: గద్వాల రాయచూరు రహదారిపై సంగాల బ్రిడ్జీ వద్ద కేబుల్ నెట్ వర్క్ కోసం కాంట్రాక్టర్లు గుంతలు తవ్వి వాటిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. గుంతలకోసం తవ్విన మట్టిని రోడ్డుపై కుప్పలుగా వేయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాత్రి వేళలో రోడ్డుపై మట్టి కుప్పలు ఉండటంతో వాహనదారులకు కనిపించక చిన్నపాటి ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయని, గత కొంతకాలంగా జాతీయ రహదారిపై ఉన్న గుంతలను తవ్వి గాలికి వదిలేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో ఈ రోడ్డు మార్గాన వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయని, అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని వాహనదారులు ఆరోపించారు. అధికారులు స్పందించి రోడ్లపై వేసిన మట్టి కుప్పలను తొలగించి, గుంతలను పూడ్చివేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News