Monday, December 23, 2024

అద్భుతమైన క్వాలిటీ ఉత్పత్తి ఇండియాలో ఉంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Excellent Quality Product Made in India

హైదరాబాద్: క్వాలిటీ అనగానే మనకు విదేశాలు గుర్తొస్తాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. భారత్ అంటేనే శక్తి వంతమైన దేశమని ప్రశంసించారు. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఫర్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ నిర్వహిస్తున్న 36వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. 1986లో చైనా, ఇండియా రెండు దేశాల జిడిపి ఓకేరకంగా ఉండేవని, కానీ ఇప్పుడు 5.7 శాతం చైనా ఎక్కువ వృద్ధి రేటు సాధించిందన్నారు. చైనా అంత వృద్ధి రేటు అంత పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయని తెలియజేశారు. సింగిల్ మైండ్ ఫోకస్ థింగ్స్, ప్రపంచ అతిపెద్ద ఫార్మా క్లస్టర్ లతో ముందుకెళ్తోందన్నారు.  అద్భుతమైన క్వాలిటీ ఉత్పత్తి మన దగ్గర ఉందని, క్వాలిటీ తక్కువగా ఉన్న చైనా ముందు కెళ్తోందన్నారు. కానీ క్వాలిటీ ఉన్న మనం ఎందుకు ముందుకు వెళ్ళటం లేదని కెటిఆర్ ప్రశ్నించారు.

కానీ ఇక్కడ కుల, మతాలు చూస్తూ వెళ్తున్నామని,  ఇవే మాటలతో నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఇన్నేళ్ల భారతావనిలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వచ్చాక వాళ్ళ ఊరుకు కరెంట్ వచ్చిందని, 2022 వరకు కూడా కరెంట్, నీళ్లు లేని ఇల్లు దేశంలో ఉండటం మన దురదృష్టమని బాధను వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News