Thursday, January 16, 2025

బంగారం.. బంగారమే!

- Advertisement -
- Advertisement -

ముంబై : అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్‌కు అనుగుణంగా బంగారం కొనడానికి ప్రయత్నిస్తారు. గత కొన్ని నెలలుగా బంగారంపై పెట్టిన పెట్టుబడి మంచి రాబడిని ఇచ్చింది. 2022లో అక్షయ తృతీయ నాడు 10 గ్రాముల బంగారం ధర రూ.50,808గా ఉంది. అంటే గతేడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటి వరకు మాత్రమే బంగారం ధర 10 గ్రాములకు రూ.9,760 పెరిగి 19.20 శాతం రాబడిని ఇచ్చింది.

ఐదేళ్లలో బంగారం ధర రెట్టింపు అయింది. 5 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.31 వేలు ఉండగా, ఇప్పుడు అది రూ. 60 వేలకు పెరిగింది. అంతర్జాతీయంగానూ ఔన్స్ పసిడి రేటు 2000 డాలర్లు దాటింది. గత 10 సంవత్సరాలను పరిశీలిస్తే బంగారం 100 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. గత 1 సంవత్సరంలో బంగారం దాదాపు 15 శాతం రాబడిని ఇచ్చింది. ఇక 2003లో అక్షయ తృతీయ పండుగ మే 4న బంగారం 10 గ్రాములు రూ. 5,656కు లభించింది. 2023లో అక్షయ తృతీయ పండుగకు 10 గ్రాముల పసిడి రూ.60,560గా ట్రేడవుతోంది.

అంటే 20 ఏళ్లలో బంగారం ధర 10 గ్రాములకు రూ.54,900 పెరిగింది. అంటే 20 ఏళ్లలో బంగారం ధర 1000 శాతం పెరిగింది. బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా 20 ఏళ్లలో 900 శాతం పెరిగింది. 2003 మే 4న కిలో వెండి రూ.7,550 వద్ద ఉంది. ఇప్పుడు కిలో వెండి రూ.76,200 వద్ద అందుబాటులో ఉంది. అంటే 20 ఏళ్లలో కిలో వెండి ధర రూ.68,650 పెరిగింది. అంటే ఈ 20 ఏళ్లలో వెండి ధరలు 900 శాతానికి పైగా రాబడి ఇచ్చింది.

మరోవైపు స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చు తగ్గుల కారణంగా బంగారానికి మద్దతు లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి భౌతికంగా బంగారం మాత్రమే కాకుండా ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. గోల్డ్ ఇటిఎఫ్‌లు, గోల్ మ్యూచువల్ ఫండ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్‌లలో (ఎస్‌జిబి) పెట్టుబడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News