Monday, December 23, 2024

రూ.2 వేల నోట్ల మార్పిడికి మరో అవకాశం

- Advertisement -
- Advertisement -

ముంబై : మీ వద్ద ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా? ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? మీకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్‌బిఐ కేంద్రాల్లోనే కాకుండా.. పోస్టాఫిసు ద్వారా కూడా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బిఐ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రూ. 2 వేల నోట్లను రిటర్న్ చేసేందుకు ఆర్‌బిఐ కార్యాలయాల వద్ద ప్రజలు భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ ప్రకటన చేసింది. ఆర్‌బిఐ అనుమతించిన 19 కార్యాలయాల్లో దేనికైనా ఏదైనా పోస్టాఫీస్ నుంచి నోట్లను పంపవచ్చునని ఆర్‌బిఐ తెలిపింది.

అయితే, ప్రజలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫామ్‌ను పూరించి, పోస్టాఫీస్ నుంచి ఆ నోట్లను ఆర్‌బిఐ ధృవీకృత కార్యాలయానికి పంపించాలని ప్రకటనలో పేర్కొంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జమ్ము, జైపూర్, కోల్‌కతా, కాన్పూర్, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం నగరాల్లోని ఆర్‌బిఐ కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవచ్చు. కాగా, 2016లో డీమోనిటైజేషన్ తర్వాత తొలిసారిగా రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోట్లను కూడా ఉపసంహరించుకోనున్నట్లు గత ఏడాది మే నెలలో అపెక్స్ బ్యాంక్ తన నిర్ణయాన్ని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News