Wednesday, January 22, 2025

ఎక్సైజ్ అధికారుల ముప్పేట దాడులు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: అచ్చంపేట మండల పరిధిలోని దర్శన్‌గడ్డ సమీపంలో శనివారం రూట్ వాష్ నిర్వహిస్తుండగా అక్రమంగా బైక్ పై తరలిస్తున్న 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని బైక్‌ను సీజ్ చేయడం జరిగిందని ఎక్సైజ్ సిఐ కృష్ణ తెలిపారు. ఎక్సైజ్ సిఐ కృష్ణ వివరాల మేరకు బైక్‌పై అక్రమంగా నాటుసారాను తరలిస్తుండగా దర్శన్ గడ్డ సమీపంలో బైక్‌ను పట్టుకోగా బైక్ నడుపుతున్న వ్యక్తి పారిపోవడం జరిగిందన్నారు. కాగా, నక్కర్లపెంట గ్రామానికి చెందిన బుజ్జిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై బాలరాజు, ఎస్సై సతీష్ కుమార్, సిబ్బంది నవీన్, స్వాతి, కానిస్టేబుల్ పరమేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News