హైదరాబాద్: తెలంగాణలో 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సైజ్‌శాఖ లేఖరాసింది. గంజాయి పండిస్తున్నందుకు ఆ రైతులకు రైతు బంధు బంద్ నిలిపివేయాలని లేఖలో పేర్కొంది. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులపై 121 కేసులు నమోదు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ జిల్లాల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేసింది. నారాయణ్‌ఖేడ్, మహబూబాబాద్, జహీరాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌కి చెందిన రైతులపై కేసులు నమోదు చేసింది. జూన్‌లో వస్తున్న రైతుబంధును రైతులకు ఇవ్వొద్దని లేఖలో ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. నల్గొండ, సూర్యాపేటలో సైతం గంజాయి పండిస్తున్న రైతుల వివరాలను ఎక్సైజ్‌శాఖ సేకరించింది. 148 మంది రైతుల ఆధార్ కార్డులు, ల్యాండ్ డాక్యుమెంట్లను కలెక్టర్లకు పంపించింది. శీలావతి అనే గంజాయి మొక్కలను రైతులు పండిస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ గుర్తించింది.
Excise Dept letter TS Govt to stop Rythu Bandhu to 148 Farmers