Thursday, January 23, 2025

రూ.2.78 కోట్ల గంజాయి, డ్రగ్స్ దహనం చేసిన ఎక్సైజ్ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడ్డ గంజాయి, డ్రగ్స్‌ను ఎక్సైజ్ సిబ్బంది దహనం చేశారు. హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన 79 కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్‌ను సోమవారం దహనం చేశారు. 79 కేసుల్లో పట్టుబడిన 135.8 కేజీల గంజాయి, 174.8 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్, 1939.5 కేజీల పాపిష్ట, 2.1గ్రాముల హషీష్ అయిల్, 300.6 గ్రాముల చరస్ , 5.14గ్రాముల కోకైన్ , 25 ఎల్‌ఎస్‌డి బాస్ట్‌లను, 9.8 కిలో అల్పోజోలుం, 14 గ్రాముల ఎస్టోస్టి పీల్స్ దహనం చేశారు.

హైదరాబాద్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ కేఏబి శాస్త్రీ అదేశాల మేరకు ఏఈఎస్ సికింద్రాబాద్ శ్రీనివాసరావు అధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ దహనం చేశారు. దహనం చేసిన వాటి విలువ రూ.2.78 కోట్లు ఉంటుంది. అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27 కేసులు, చార్మినార్ స్టేషన్‌లో 13 కేసులు, గోల్కొండ స్టేషన్‌లో 39 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పట్టుబడ్డ గంజాయి, డ్రగ్స్‌ను జీజే మల్టీ కౌవ్ ఇండియాలోని దహనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News