Sunday, December 22, 2024

ఎక్సైజ్ అధికారుల ముప్పేట దాడులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దేవదారి కుంట, లింగోటం తండా మధ్య ఎక్సైజ్ శాఖ అధికారులు రూట్ వాచ్‌లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంచగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎక్సైజ్ సిఐ కృష్ణ, ఎస్సై బాలరాజ్ తెలిపారు. ఎక్సైజ్ సిఐ కృష్ణ తెలిపిన వివరాల మేరకు మంగళవారం రూట్ వాచ్ నిర్వహిస్తుండగా 360 కేజీల నల్లబెల్లాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని, దేవదారి కుంట గ్రామానికి చెందిన తిరుపతిపై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. బుధవారం అచ్చంపేట తహసిల్దార్ ముందు బైండోవర్ చేస్తామని అధికారులు తెలిపారు. ముప్పేట దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై బాలరాజు, ఎస్సై సతీష్ కుమార్, నవీన్ కానిస్టేబుల్ సిబ్బంది ఉన్నారు.

Excise Officials Seized black jaggery Nallabellam in Achampet

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News