Sunday, December 22, 2024

400 కిలోల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

Excise police seized 400 kg of ganja in Rangareddy

 

ముగ్గురి అరెస్టు, పరారీలో నలుగురు నిందితులు
గంజాయి విలువ కోటి రూపాయలు

హైదరాబాద్: నిషేధిత గంజాయిని రవాణా తరలిస్తున్న ముగ్గురు నిందితులను రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..పేరపురెడ్డి అర్జున్, నేరెళ్ల కిరణ్‌కుమార్, సయ్యద్ తాహెర్, పేరపురెడ్డి రాజ్‌వీరేంద్రకుమార్, సందీప్, తేజ, ఫజల్ కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు. నిందితులు అందరూ కలిసి ముఠా ఏర్పడి ఎపిలోని విశాఖ నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు.

400 కిలోల గంజాయిని ప్యాకెట్లలో నింపి డిసిఎం వ్యాన్, టయోటా ఇటియోస్ కారులో 27 ప్లాస్టిక్ డబ్బాల్లో గంజాయిని తరలిస్తున్నారు. నిందితుల్లో పేరపురెడ్డి అర్జున్, నేరెళ్ల కిరణ్‌కుమార్, సయ్యద్‌తాహెర్‌ను అరెస్టు చేయగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. మేడ్చల జిల్లా, ఉప్పల్ మండలం, ఉప్పల్ భగాయత్‌లోని రాఘవేంద్రకాలనీలో నిందితులు గంజాయిని దాచినట్లు తెలియడంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి. డేవిరవికాంత్, మల్కాజ్‌గిరి డిపిఈఓ అరుణ్‌కుమార్, ముకుందరెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, ఎండి అబ్దుల్ జబ్బార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News