Friday, January 17, 2025

గోవా నుంచి తెలంగాణకు భారీగా లిక్కర్ దిగుమతి

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఏకంగా గోవా నుంచి లిక్కర్‌ను తెలంగాణకు తరలించే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటి పెయిడ్ మద్యాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. వాహనాల తనిఖిల్లో భాగంగా రూ. 2.07 కోట్లు విలువ చేసే లిక్కర్‌ను సీజ్ చేశారు. జాతీయ రహదారి 44 మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు.

అడ్డాకులకు చెందిన ఎస్‌ఐసి శ్రీనివాస్ ఇచ్చిన పక్కా సమాచారం మేరకు డీసిఎంలో తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్ప్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు సీజ్ చేశామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. జడ్చర్ల ఎక్సైజ్ సిఐ , బాలానగర్ ఎస్‌ఐ , సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారని పేర్కొన్నారు. గోవాకు చెందిన జి. జాకప్‌తో పాటు హెల్పర్‌ను అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం 48బాక్సుల్లో 17,280లీటర్ల మధ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రాయల్ బ్లూ, రాయల్ క్వీన్ మద్యం ఉందని అసిస్టెంట్ కమీషనర్ ఆర్ . కిషన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News