Monday, December 23, 2024

డ్రగ్స్ పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

Excise police seizing drugs

ఎల్‌ఎస్‌డి, గంజాయి స్వాధీనం

హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 5 ఎల్‌ఎస్‌డి బోల్ట్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం…. మెహిదీపట్నంలోని రిలయన్స్ కోహినూర్ అపార్ట్‌మెంట్‌కు చెందిన అర్బాజ్ డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. దీంతో ఎక్సైజ్ దాడి చేసి 5ఎల్‌ఎస్‌డి బోల్ట్ ఎనిమిది సాచెట్స్‌లోని డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ముబాసిర్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. డార్క్ వెబ్ సైట్‌లో సోహిబ్ ఖాన్ గంజాయి, ఎల్‌ఎస్‌డిని ఆర్డర్ చేశారని తెలిపారు. వెంటనే ఎంఎస్‌ఎన్ హైట్స్‌లోని సోహిబ్ ఖాన్ అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేసి ఎక్‌టసీపిల్, గ్రాము ఓజి కుష్, 10 గ్రాముల డ్రై గంజా, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వస్తువులతోపాటు నిందితులను కేసు దర్యాప్తు కోసం గోల్కొండ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News