Monday, November 18, 2024

నిబంధనల ప్రకారమే సోమ్‌కు అనుమతి

- Advertisement -
- Advertisement -

వివిధ కంపెనీలకు మద్యం
సరఫరాకు అనుమతులిచ్చాం
బిఆర్‌ఎస్ హయాంలోనూ
కొత్త డిస్టిలరీలకు పర్మిషన్లు
ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ పాలసీ ప్రకారం, బేవరేజ్ కార్పొరేషన్ ‘సోమ్’ డిస్టిలరీస్‌తో పాటు ఇతర కంపెనీలకు మద్యం సరఫరాకు అనుమతులిచ్చారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో నాలుగు సంవత్సరాల క్రితం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2020-,21 సంవత్సరంలో 50 లిక్కర్ బ్రాండ్లు, 5 బీరు బ్రాండ్ల కంపెనీలకు, 2021-, 22లో 75 లిక్కర్ బ్రాండ్లు, 8 బీరు బ్రాండ్ల కంపెనీలకు, 2022,- 23లో 122 లిక్కర్ బ్రాండ్లు, 11 బీరు బ్రాండ్ల కంపెనీలకు, 2023, 24లో 41 లిక్కర్ బ్రాండ్లు, 9 బీరు బ్రాండ్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని ఆయన తెలిపారు. గతంలో కూడా బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త మద్యం కంపెనీలకు ఇలాగే అనుమతులు ఇచ్చిందని, దాని ప్రకారమే తాము అనుమతులు ఇచ్చామని, దురుద్దేశపూర్వకంగా కొన్ని వార్త పత్రికలు తప్పుడు వార్తలను ప్రచురించాయని ఆయన వెల్లడించారు.
97.44 శాతం విదేశీ కంపెనీలే…
మొత్తం ఐఎంఎఫ్‌ఎల్/బీర్ల తయారీ, సప్లయ్‌లో 97.44 శాతం విదేశీ కంపెనీలే ఆక్రమించాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు మన దేశానికి చెందిన సోమ్ డిస్టలరీకి మద్యం సరఫరాకు అనుమతులు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని కూడా బిఆర్‌ఎస్ నాయకులు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి అసంబద్దమైన దుష్ప్రచారాలను ప్రచారం చేయడం మానుకోవాలని మంత్రి జూపల్లి కోరారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తూ ప్రజల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News