Wednesday, January 22, 2025

ఎక్సైజ్ పాలసీ కేసు: ఇద్దరు నిందితులకు బెయిలు

- Advertisement -
- Advertisement -
క్షమాపణలు చెప్పాలని బిజెపిని డిమాండ్ చేసిన ఆప్

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిలు మంజూరుచేసిన నేపథ్యంలో తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు బిజెపి క్షమాపణలు చెప్పాలని ఆప్ ఆదివారం డిమాండ్ చేసింది. విలేకరుల సమావేశంలో ఆప్ సీనియర్ నాయకురాలు, క్యాబినెట్ మంత్రి అతిష్ మాట్లాడుతూ, రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నారని, గోవా ఎన్నికలలో డబ్బును ఉపయోగించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) రెండు ఆరోపణలు చేసిందన్నారు.

‘నిన్న రౌస్ అవెన్యూ కోర్టు రాజేశ్ జోషి , గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్ మంజూరు చేసింది. లంచం లేదా ముడుపుల కోసం నగదు చెల్లింపులు జరిగాయన్న ఎలాంటి సాక్షాధారాలను ఈడి కోర్టు ముందుంచలేకపోయింది అని కోర్టు ఉత్తర్వు తెలిపింది. సాక్షుల కొన్ని అస్పష్టమైన వాంగ్మూలాలను ఈడి జత చేసిందని ఉత్తర్వులో పేర్కొంది’ అని ఆమె తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసు మొత్తం ‘బోగస్’ అని, కేవలం తమ పార్టీని కించపర్చడానికి ఉద్దేశించిందని పేర్కొన్నారు. ‘ఇప్పుడు కోర్టు కూడా ఎలాంటి ముడుపులు లేదా మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆధార సాక్షం లేదని చెప్పింది. మద్యం కుంభకోణం అంతా బూటకమని, కేవల్ ఆప్‌ని కించపరచడానికే అని మేము మొదటి నుంచి చెబుతున్నాం’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘ఎన్నికల కోసం రూ. 30 కోట్లు గోవాకు చేరాయని జోషి అనే విక్రయదారుడు నిర్ధారించారని,అయితే ‘ఈ వాస్తవాన్ని ధృవీకరించడానికి స్వతంత్ర సాక్షాలు లేవు’ అని ఉత్తర్వు పేర్కొంది. ‘ఈ ఉత్తర్వు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అత్యంత నిజాయితీగల పార్టీ అని రుజువు చేస్తోంది. స్కామ్ జరిగిందని బిజెపి అధికార ప్రతినిధులు అరిచారు. అయితే ఇప్పుడు స్కామ్ జరగలేదని అంగీకరిస్తారా? క్షమాపణలు చెబుతారా?’ అని ఆమె అడిగారు. కోర్టు ఉత్తర్వును చదిని అతిషి ‘ఈడి ప్రకటనలో వైరుధ్యాలు, మినహాయింపులు ఉన్నట్లు కోర్టు గమనించింది’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News