Sunday, January 19, 2025

ఎల్లారెడ్డిపేటలో ఎక్సైజ్ ఎస్‌ఐ మృతి

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: ఎక్సైజ్ ఎస్‌ఐ అనుమానాస్పదంగా చెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లాకు చెందిన కాళి ప్రసాద్(58) అనే ఎక్సైజ్ ఎస్‌ఐ ఎల్లారెడ్డిపేటకు బదిలీపై ఫిబ్రవరి నెలలో వచ్చారు. ఎల్లారెడ్డిపేటలో రూమ్ అద్దెకు తీసుకొని నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. అద్దె ఇంట్లో విగతజీవిగా పడి ఉండడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఎక్సైజ్ డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరిశీలిస్తున్నారు. ఎవరైనా హత్య చేశారా? లేక గుండె పోటుతో చనిపోయాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చిన తరువాత నిజాలు బయటకు వస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News