Monday, December 23, 2024

రాజస్థాన్‌ సిఎం పీఠంపై ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

జైపూర్ : బిజెపి ఘన విజయం సాధించిన రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటికీ ఉత్కంఠ సాగుతోంది. ఆదివారం దాదాపు పది మంది బిజెపి ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను సివిల్ లైన్స్‌లోని ఆమె నివాసంలో కలిశారు. బిజెపి శాసనసభా పక్ష నేత ఎంపికకు బిజెపి అధినాయకత్వం ఇప్పటివరకూ పిలుపు నివ్వలేదు. దీనితో తదుపరి సిఎం ఎవరనేది తేలకుండా సాగుతోంది. ఈ దశలోనే అజయ్ సింగ్, బాబూ సింగ్ సహా పది మంది ఎమ్మెల్యేలు రాజే నివాసానికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రానికి రెండు సార్లు సిఎం అయిన అనుభవం, పూర్వపు రాజవంశపు ప్రాబల్యం సంతరించుకుని ఉన్న వసుంధరాను ఈ వారంలోనే బృందాలుగా పలువురు ఎమ్మెల్యేలు కలిసివెళ్లుతున్నారు. బిజెపి తరఫున సిఎం అయ్యే వారిలో వసుంధరా రాజే పేరు ప్రధానంగా విన్పిస్తోంది.

తమ నివాసంలో ఉంటూనే వసుంధరా రాజే పార్టీలో బలప్రదర్శనకు దిగుతున్నారని వెల్లడైంది. కాగా ఇటీవలే ఆమె ఢిల్లీకి వెళ్లినప్పుడు బిజెపి జాతీయ స్థాయి అధ్యక్షులు జెపి నడ్డాను కలిశారు. లెజిస్లేచర్ పార్టీ నిర్వహణకు ఇప్పటికీ తేదీని ఖరారు చేయలేదు. తదుపరి సిఎం ఎంపిక లేదా ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేందుకు బిజెపి అధినాయత్వం ముగ్గురు పరిశీలకులను నియమించింది. వీరిలో కేంద్ర రక్షణ మంత్రి, బిజెపి సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ ఇందులో ప్రముఖ పాత్రలో ఉన్నారు. పార్టీలోని వివిధ వర్గాల నడుమ సయోధ్య ఖరారు చేసేందుకు యత్నిస్తున్నారు. ఆ తరువాతనే బిజెపి శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. ఇటీవలి ఎన్నికలలో మొత్తం 200 స్థానాల రాజస్థాన్ అసెంబ్లీలో బిజెపికి 115 సీట్లు, కాంగ్రెస్‌కు 69 స్థానాలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News