Monday, December 23, 2024

కొడంగల్‌లో ఉత్సాహంగా 2కె రన్

- Advertisement -
- Advertisement -
  • హాజరైన ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్ ఉత్సాహంగా సాగింది. సోమవారం ఉదయం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జెండా ఊపి పరుగును ప్రారంభించిన ఎమ్మెల్యే పరుగు తీస్తూ అందరిని ఉత్సహాపరిచారు. అనంతరం అయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు దశాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రం చిన్నదైన సంక్షేమం, అభివృద్ధ్దిలో ఎంతో గొప్పదన్నారు.

ఆరోగ్యవంతమైన జీవితానికి రోజు ఉదయం గంట సమయాన్ని వాకింగ్ లేదా వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. ఉరుకుల, పరుగుల జీవితం వల్ల నేడు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్నట్లు గుర్తుచేశారు. 2కె రన్‌ను విజయవంతం చేసినందుకు పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి కృష్ణన్, కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐలు రవిగౌడ్, రమేష్‌కుమార్, శంకర్‌లతో పాటు పిఎసిఎస్ చెర్మెన్ శివకుమార్, కౌన్సిలర్‌లు మదుసూధన్‌రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News